VSP: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి డిసెంబర్ 1 నుంచి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్లు ఆలయ ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. పురుషులు ధోతీ, కుర్తా లేదా ఫార్మల్ దుస్తులు, మహిళలు చీర, లంగా ఓణీ లేదా చుడీదార్ ధరించి రావాలని సూచించారు. జీన్స్, టీ-షర్టులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులతో వచ్చే భక్తులకు దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలం ఆలయంలో డిసెంబర్ 1 నుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి


