హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22 ఏళ్లకే సర్పంచ్‌గా షేక్ కౌసర్ విజయం

ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా 22 ఏళ్ల షేక్ కౌసర్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 328 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాకుండా గ్రామంలోని మొత్తం 10 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. చిన్న వయస్సులోనే సర్పంచ్‌గా ఎన్నికవడంతో పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.