హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండలాల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ASR: జి.మాడుగుల మండలంలోని 17 పంచాయతీల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పెద్ద లువ్వసింగి, కుమ్మిడిసింగిలో వైసీపీ మద్దతుదారులు, కిల్లంకోటలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. బీరంగిలో టీడీపీ అభ్యర్థి కొర్ర లలిత, పెదబయలు మండలం వనబంగిలో టీడీపీ అభ్యర్థి పూజారి బొంజన్న విజయం సాధించారు. వనబంగిలో 66.44 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.