హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రిని కలిసిన సర్పంచ్

కృష్ణా: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని గుంటాకోడూరు సర్పంచ్ జయరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొడాలి నానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కొడాలి నాని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కొడాలి నాని సూచించారు.