హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MBBS చదువుతూనే సర్పంచ్‌గా విజయం

నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్‌గా మూరుబోయిన స్నేహ 67 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. వైద్య విద్యను అభ్యసిస్తూనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికవడం విశేషంగా నిలిచింది. చదువుతో పాటు ప్రజాసేవలోనూ అడుగుపెట్టిన స్నేహ విజయం గ్రామస్థుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.