హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

విజయనగరం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 10 మండలాల్లో కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు 1,996 వార్డుల కౌంటింగ్ పూర్తయింది. 244 సర్పంచ్ స్థానాలకు గాను 146 ఫలితాలు వెల్లడికాగా, 98 చోట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉపసర్పంచ్ ఎన్నికల్లో 42 స్థానాలకు గాను 16 పూర్తికాగా, మరో 26 చోట్ల ప్రక్రియ కొనసాగుతోంది.