హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేమకల్‌లో వైసీపీలోకి 30 కుటుంబాల చేరిక

KRNL: చిప్పగిరి మండలం నేమకల్ గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 30 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కరివేముల రంగస్వామి, మాజీ సర్పంచ్ ప్రేమకుమార్ ఆధ్వర్యం వహించారు. వైసీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన రంగస్వామిని ఎమ్మెల్యే అభినందించారు