హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒక్కరోజే 2,196 సత్యనారాయణ వ్రతాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఒక్కరోజే 2,196 మంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. ప్రధాన ఆలయంలో ఏడు బ్యాచ్‌లుగా 2,010 వ్రతాలు నిర్వహించగా, పాతగుట్టలో 186 వ్రతాలు జరిగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.