హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు!

GNTR: ఒడిశా నుంచి బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా తరలిస్తున్న 71.3 కిలోల గంజాయిని కాజ టోల్‌గేట్ వద్ద గుంటూరు పోలీసులు, ఈగల్ బృందం సంయుక్తంగా పట్టుకున్నారు. రెండు కార్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. ఆదివారం వివరాలను డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఈ దాడి చేసినట్లు వెల్లడించారు.