హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు గ్యారెంటీ అమలులో కాంగ్రెస్ విఫలం: MLA

జనగామలో నిర్వహించిన దీక్షా దివస్‌లో సిద్దిపేట MLA హరీశ్ రావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 2 ఏళ్లు దాటినా ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని మర్చిపోయి గ్లోబల్ సమ్మిట్ పేరుతో కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.