MDK: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను మెదక్ రూరల్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఉదయం పెట్రో కార్ సిబ్బంది విధుల్లో ఉండగా ఆవుసులపల్లి గ్రామ శివారులో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కనిపించింది. పోలీసులను గమనించిన డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ట్రాక్టర్ను స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
పోలీసులను చూసి ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ పరారీ


