హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల కోసం బ్యాటరీ వాహనం విరాళం

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రయాణికుల బ్యాటరీ వాహనాన్ని విరాళంగా అందజేసింది. బ్యాంక్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ ఎం.వి.ఎస్. సుధాకర్, ఆర్‌ఎం తదితరులు దేవస్థానం ఈవో బి.కె. వెంకటేశులుకు వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉపయోగపడేలా వాహనాన్ని అందించిన బ్యాంక్ అధికారులకు ఈవో కృతజ్ఞతలు తెలిపారు.