హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోయవారిపాలెంలో ఎన్నికల ప్రచారం

GNTR: ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామంలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గండు పద్మావతి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు.