హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి చిత్రపటం ఊరేగింపు

ATP: గుత్తిలో ఆంజనేయస్వామి దీక్షపరులు ఆదివారం భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కొలువు తెరిచి మేళ తాళాలు నడుమ ఊరేగింపు నిర్వహించారు. 'జై శ్రీరామ్ జైశ్రీరామ్' అంటూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చెరువు కట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.