హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో జూనియర్ బేస్‌బాల్ సెలక్షన్స్

PLD: రొంపిచర్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పల్నాడు జిల్లా జూనియర్ బేస్‌బాల్ సెలక్షన్స్ జరిగాయి. అసోసియేషన్ సెక్రటరీ వి.వేమారెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో 150 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో కంచర్లవారిపల్లెలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.