హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

CTR: గుడిపాల మండలంలో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన ముగ్గురు టీడీపీ నాయకులపై సస్పెన్షన్ వేటు పడింది. వసంతాపురానికి చెందిన బాబు, నారగల్లుకు చెందిన సంతోష్, విజయ్‌లను పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం యాదవ్ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.