MBNR: జిల్లా కేంద్రంలోని ఏదిరా 5వ డివిజన్‌లో నిర్వహించిన అయ్యప్పస్వామి మహాపడిపూజకు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఆలయ అర్చకులు, అయ్యప్ప స్వాములు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించిన ఆయన, నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.
తెలంగాణ
మహా పడిపూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్


