హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు, సిరా

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో ఆదివారం రెండో విడత పంచాయతీ పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గం వారు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు, సిరా పోశారని సమాచారం. అధికారులు పోలింగ్ నిలిపి, కొత్త బాక్సులు ఏర్పాటు చేసి తిరిగి కొనసాగించారు. గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు.