హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్యకు గురైన కూతురికి పుట్టినరోజు వేడుక

CTR: కన్నకూతురిని కోల్పోయిన బాధ నుంచి ఆ తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు. అక్టోబర్ 31న తిరుపతిలో హత్యకు గురైన రొంపిచర్లకు చెందిన భాగ్యశ్రీ జ్ఞాపకాలను తలచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆదివారం ఆమె 27వ పుట్టినరోజు సందర్భంగా సమాధి వద్ద పూజలు నిర్వహించారు. చిత్రపటం ముందు స్వీట్లు ఉంచి పుట్టినరోజు జరిపి, కుమార్తె జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.