హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూసిపుట్టులో వైసీపీ అభ్యర్థి విజయం

అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు గ్రామ పంచాయతీలో వైసీపీ అభ్యర్థి పాంగి సత్యరావు 278 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థులపై గెలుపొందడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నూతన విజేత సత్యరావుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సత్యరావు హామీ ఇచ్చారు.