హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఓటుతో జనసేన అభ్యర్ధి విజయం

కోనసీమ: రాయవరం పంచాయతీ పరిధిలోని 3వ వార్డు సభ్యురాలిగా జనసేన బలపరిచిన తూము వెంకటరమణ ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. ఆమెకు 172 ఓట్లు రాగా, ప్రత్యర్థి మల్లిపాల అమ్మాణికి 171 ఓట్లు వచ్చాయి. పంచాయతీలో 1 నుంచి 7 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. 8 నుంచి 14 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.