ATP: పుట్లూరు మండలం కడవకల్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు అభ్యర్థి రామలక్ష్మమ్మ విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3,185 ఓట్లకు గాను 2,617 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థిపై 499 ఓట్ల మెజార్టీతో రామలక్ష్మమ్మ గెలుపొందడంతో గ్రామంలోని టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడవకల్లు సర్పంచ్‌గా రామలక్ష్మమ్మ విజయం


