HYD: నగరంలో తాగునీటి కొరత నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి కఠిన చర్యలు చేపట్టింది. తాగునీటితో ఇళ్లు తుడవడం, డ్రైవ్వేలు కడగడం వంటి పనులకు నీటిని వినియోగిస్తే రూ.1,000 నుంచి రూ.20,000 వరకు జరిమానా విధిస్తోంది. పానీ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ
నీటిని వృథా చేస్తే భారీ జరిమానా


