హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 76.77 శాతం పోలింగ్ నమోదు..!

అన్నమయ్య జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 76.77 శాతం పోలింగ్ నమోదైంది. 10 మండలాల్లోని 151 పంచాయతీల్లో 1,545 కేంద్రాల్లో 3,47,277 మంది ఓటర్లకు గాను 2,66,613 మంది ఓటు వేశారు. పుంగనూరులో అత్యధికంగా 85.39 శాతం, పీలేరులో అత్యల్పంగా 63.07 శాతం పోలింగ్ నమోదైంది.