హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్ష రాస్తున్న తల్లికి అండగా మహిళా కానిస్టేబుల్

SRD: సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు తన చంటిబిడ్డతో వచ్చిన ఓ మహిళా అభ్యర్థికి మునిపల్లి పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ అండగా నిలిచారు. పరీక్ష ముగిసే వరకు చిన్నారిని ఎత్తుకుని లాలించడంతో ఆ తల్లి ప్రశాంతంగా పరీక్ష రాయగలిగింది. విధి నిర్వహణలో మానవత్వం, మాతృత్వం చాటిన ఆ కానిస్టేబుల్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.