హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పిట్లం శివారులో కారుకు అగ్నిప్రమాదం

KMR: పిట్లం జాతీయ రహదారి-161పై ఆదివారం కారు దగ్ధమైంది. మహారాష్ట్రలోని బాస్మత్‌కు చెందిన యాసిర్ మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్‌కు వెళ్తుండగా, పిట్లం శివారులో కారులో పొగలు రావడంతో పక్కకు నిలిపివేశారు. ముగ్గురూ కిందకు దిగిన వెంటనే కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.