హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు గాజువాకలో ఉద్యోగ మేళా

VSP: గాజువాకలో నవంబర్ 30న APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. MVR కళాశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాలో 16కు పైగా కంపెనీలు పాల్గొని 400కుపైగా ఉద్యోగాలకు ఎంపికలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు naipunyam.ap.gov.in, 7893787028ను సంప్రదించాలి.