హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో అంబేద్కర్ దినోత్సవం

ASR: పాడేరు మండలం గుడివాడ హెడ్ ఆఫీస్ లో ఆదివాసి హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు కమ్మిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులందరూ ఏకమై సమావేశం నిర్వహించి, రాజ్యాంగం కల్పించిన చట్టాలు, ఆర్టికల్స్ పై అవగాహన కల్పించారు. హక్కుల పరిరక్షణకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.