హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సింగపాడులో టీడీపీ జయకేతనం!

PLD: నర్సింగపాడు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 25 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామంలో మళ్లీ టీడీపీ జెండా ఎగిరింది. పార్టీ మద్దతుదారుడు కైపు రవీంద్రరెడ్డి తన సమీప ప్రత్యర్థిపై సుమారు 170 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించి, పాతికేళ్ల కలని నిజం చేశారు. దీంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.