హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తా చాటిన కారు మస్తాన్ కుటుంబం

TPT: రేణిగుంట పట్టణంలోని బుగ్గ వీధిలో కారు మస్తాన్ కుటుంబం స్థానిక ఎన్నికల్లో మరోసారి విజయాలు సాధించింది. 6వ వార్డు నుంచి ఎస్. రిజ్వాన్ కుమారుడు ఎస్. రబ్బానీ 50 ఓట్ల మెజారిటీతో, 8వ వార్డు నుంచి మాజీ వైస్ సర్పంచ్ ఎస్. ఇర్ఫాన్ భార్య ఎస్. సాజిదా 160 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రెండు దశాబ్దాలుగా కుటుంబం కొనసాగిస్తున్న ప్రజాసేవకు ఈ విజయాలు నిదర్శనమని అనుచరులు పేర్కొన్నారు.