హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కలతో ప్రజలకు తప్పని తిప్పలు

VKB: బంట్వారం మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా వీధుల్లో సంచరిస్తుండటంతో ప్రజలు, చిన్నారులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో కుక్కల అరుపులు, రోడ్లపై వాటి సంచారం ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.