హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్య అన్నదానానికి భారీ విరాళం

CTR: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి ముగ్గురు దాతలు రూ.3,01,232 విరాళంగా అందజేశారు. నెల్లూరుకు చెందిన దుర్గా శంకర్ రెడ్డి రూ.1,00,116, మదనపల్లెకు చెందిన మహేందర్ వైద్యం రూ.1,00,000, గుంటూరుకు చెందిన సుబ్బారావు రూ.1,01,116 సమర్పించారు. దాతలకు ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు.