హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్ ధర్మశాలకు MLA విరాళం

NZB: కేంద్రంలోని వీర హనుమాన్ మందిరం వద్ద నిర్మిస్తున్న నూతన ధర్మశాల పనులను ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ కమిటీ, గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు పనులు త్వరగా పూర్తిచేసేందుకు ఆయన రూ. 11 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. భారీగా నిధులు కేటాయించిన MLAకు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.