హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (సోమవారం) ఉదయం 8 గంటలకు VKR & VNB కళాశాలలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఆదివారం అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.