హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్టీ కమిషన్‌కు గిరిజనుల ఫిర్యాదు

KMM: సత్తుపల్లిలో 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చెందిన 145 ఎకరాల్లో 22 ఎకరాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయించడంపై రైతులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిశీలించారు. గిరిజనుల భూములను తిరిగి వారికి అప్పగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.