వరంగల్ మట్టేవాడ ఈద్గాలో దావత్ ఎ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండీ పాషా, మసూద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం


