హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివస్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: చర్లపల్లిలో నిర్వహించిన కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో పాటు ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.