హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించాలి'

KNR: ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదిగినప్పుడే ఆధునిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని డీఈఓ వై. తిరుపతిరావు అన్నారు. ఆదివారం శ్రీ సరస్వతి శిశు మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను సందర్శించి విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. రెండో రోజు సుమారు 500 మంది విద్యార్థులు, 200 మందికి పైగా సందర్శకులు మేళాను సందర్శించారు.