హైదరాబాద్: 28°C
తెలంగాణ

హక్కుల కోసం పోరాడాలి: కల్లు గీత కార్మిక సంఘం

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా చైతన్య సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ పాల్గొని మాట్లాడారు. గీత కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హక్కుల సాధన కోసం ఏకతాటి పైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.