హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MHBD: సిరోలు మండలం కొత్తూరు(సి) గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామైక్య సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ ఆదివారం ప్రారంభించారు. భవనాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.