హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొరం రవాణాపై పోలీసుల కొరడా.. జేసీబీ, రెండు ట్రాక్టర్లు సీజ్

KMR: ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో అక్రమంగా మొరం రవాణా చేస్తున్న వాహనాలపై పోలీసులు దాడులు నిర్వహించి చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మొరం తరలిస్తున్న ఒక జేసీబీతో పాటు రెండు ట్రాక్టర్లను ఎల్లారెడ్డి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ ఎన్. రాజు వెల్లడించారు.