నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ స్థానాలను 543 నుంచి 815కి పెంచే కేంద్ర యోచనపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీల సంఖ్య పెరిగితే చాలామందికి మాట్లాడే అవకాశమే దక్కక కేవలం చప్పట్లు కొట్టడానికే పరిమితమవుతారని పేర్కొన్నారు. బీజేపీ దేశ సంక్షేమం కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందా అని జంషెడ్‌పూర్‌లో మాట్లాడారు.
వార్తలు
అంతమంది ఎంపీలుంటే చప్పట్లకే పరిమితం: శశిథరూర్


