హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లెపోరు.. నకిలీ బ్యాలెట్‌ పేపర్ల కలకలం

AP: ఎన్టీఆర్ జిల్లా పెద్దాపురం గ్రామంలోని ఎనిమిదో వార్డులో నకిలీ బ్యాలెట్ పేపర్లు కలకలం రేపాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర నకిలీ బ్యాలెట్ పేపర్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని పోలింగ్ జరగకుండా కాసేపు అడ్డుకున్నారు. ఆర్డీవో, తహశీల్దార్లు పరిశీలిస్తామని హామీ ఇచ్చిన తర్వాత పోలింగ్ కొనసాగించారు.