హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్‌కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీష్ రావు

TG: రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణను సాధించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు KCR అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన గాడి తప్పిందని ఆరోపించారు. KCR అమలు చేసిన పథకాలు ఒక్కొక్కటిగా నిలిచిపోతున్నాయని విమర్శించారు. KCR ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.