హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్వీయూలో ఏఐ ఆన్‌లైన్ శిక్షణ

TPT: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 29 వరకు నెలరోజుల ఆన్‌లైన్ ఏఐ శిక్షణ ఉంటుంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని, పర్ప్లెక్సిటీ వినియోగంపై సుమారు 3 వేల మంది బోధకులకు తర్ఫీదు ఇస్తారు. ఉపకులపతి ప్రొఫెసర్ టాటా నరసింగరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.