GNTR: తెనాలిలో వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మూడవ వారం సామూహిక శ్రీ సత్యదేవ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో 165 మంది దంపతులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. ఆలయ సహాయ కమిషనర్ అనుపమ, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి వైకుంఠపురం ఆలయంలో సామూహిక సత్యదేవ వ్రతాలు


