హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్ల ఎమ్మెల్యేపై అన్నం సతీష్ తీవ్ర ఆరోపణలు

బాపట్లలో ఇసుక దందా, రేషన్ బియ్యం మాఫియాను ఎమ్మెల్యేయే నడుపుతున్నారని అన్నం సతీష్ ఆరోపించారు. లారీ ఇసుకను రూ.10 వేలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 2014లో బాకీ కింద ఇచ్చిన ఆస్తులతో ఎమ్మెల్యే లాభపడ్డారన్నారు. విదేశీ పర్యటనలపై ఇద్దరి పాస్‌పోర్టులు బయటపెట్టాలని సవాల్ విసిరారు. ఏఐ ఆరోపణలపై పూర్తిస్థాయి పోలీసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.