ప్రకాశం: అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ పీ. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి, పోలింగ్ సరళిపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కాకర్లలో ఎన్నికల సరళిని పరిశీలించిన జేసీ


