హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల పక్కనే అపరిశుభ్రత.. దుర్వాసనతో స్థానికుల అవస్థలు!

విశాఖ దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు ఎంవీడీఎం ఎలిమెంటరీ పాఠశాల ప్రహరీ పక్కన రోడ్డుపై బహిరంగ మలమూత్ర విసర్జనతో పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమల వ్యాప్తి పెరిగి పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ జోన్‌లోనే ఈ పరిస్థితి నెలకొనడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.