హైదరాబాద్: 28°C
వార్తలు

ఫోన్ పోతే ఆశ వదులుకోనక్కర్లేదు: మోదీ

ఫోన్ పోతే తిరిగి దొరుకుతుందన్న ఆశ క్రమంగా సన్నగిల్లుతుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని 'మన్ కీ బాత్' 140వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ అన్నారు. పోయిన మొబైల్‌ను తిరిగి పొందేందుకు కేంద్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'సంచార్ సాథీ' ఎంతో సాయపడుతుందన్నారు. ఇప్పటివరకు ఈ పోర్టల్ 30 కోట్లకు పైగా విజిట్లు దాటిందని, దీని యాప్ దాదాపు 3 కోట్ల డౌన్‌లోడ్లు అయిందని ప్రధాని తెలిపారు.